జాతీయ విద్యా విధానం (యన్.ఈ.పీ.) 2020 ని, రాష్ట్రం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ.పీ.టీ.ఎఫ్.1938. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.సాంబశివుడు, జిల్లా అదనపు కార్యదర్శి నగిరి.శ్రీనివాసులు మాట్లాడుతూ యన్.ఈ.పీ.అమలు లో బాగంగా ప్రాథమిక పాఠశాలలను విడదీసి 3.4.5.తరగతులను 3. కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల విద్యార్థులు అంతదూరం వెళ్ళలేక డ్రాపౌట్సు గా మారే ప్రమాదం ఉందని కాబట్టి దీనికి సంబంధించిన జి.ఒ.నెంబర్ 85 ను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలను బలహీన పరుస్తూ 4674 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జి.ఒ.నెంబర్ 37 ను వెంటనే రద్దు చేయాలని ఉన్నత పాఠశాలలో విధిగా తెలుగు మీడియం ను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీనియర్ నాయకులు యం.పుల్లయ్య, యం.రవి.మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులతో డీ.ఎస్సీ.ని ప్రకటించి, భర్తీ చేయాలని, వివిధ రకాల యాప్ లను తొలగించి ఉపాధ్యాయులకు బోధనచేసే స్వేచ్ఛ ను కల్పించాలని, అలాగే రాష్ట్రంలో సి.బి.యస్.ఈ. సిలబస్ ను అమలు చేయవద్దని, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఉన్న"నూతన జాతీయ విద్యా విధానం 2020" ని రాష్ట్రం లో అమలు చేయకూడదని వారు డిమాండ్ చేశారు.
విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని కోరారు.
కావున ప్రభుత్వం వెంటనే విద్యా పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో చర్చించి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
ఈ నిరసన కార్యక్రమం లో గోపాల్ రావు, వై.విజయ కుమార్, యస్.వెంకటరమణ, డి.మౌలాలి. మద్దిలేటి,. రాంప్రసాద్,.యన్.రమణ., బత్తుల రవి కుమార్, యం.పవన్., కృష్ణమూర్తి., AISF సీటీ కన్వీనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.